దేశంలో మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగనున్నాయి. ఈ ఏడాది వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా నార్త్ ఇండియా ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో జరుగుతున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని, కార్బన్ డయాక్సైడ్, మిథైన్, గ్రీన్ హౌస్ వాయువులతో భూమి మండుతోందని వివరించారు.