తెలంగాణలో రానున్న రెండు రోజులు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 1 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.