ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో వరంగల్‌లో హైటెన్షన్ నెలకొంది. మిస్ వరల్డ్ పోటీదారులు ప్రయాణించనున్న ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారుల షాపులను తొలగించడంపై GWMCపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ నుంచి కాజీపేట వరకు రోడ్డుపై ఇరువైపులా ఏర్పాటు చేసిన స్ట్రీట్ జోన్లను అధికారులు తొలగించడంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. దీంతో GWMC ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.