WPL చరిత్రలో అత్యధిక స్కోర్... యూపీ వారియర్స్ సరికొత్త రికార్డు

71చూసినవారు
WPL చరిత్రలో అత్యధిక స్కోర్... యూపీ వారియర్స్ సరికొత్త రికార్డు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచులో యూపీ వారియర్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపీ జట్టు 225/5 పరుగులు చేసింది. WPL చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ 223/2 స్కోర్ చేయగా, దాన్ని ఇప్పుడు యూపీ వారియర్స్ బద్దలుకొట్టింది. యూపీ ఓపెనర్ జార్జియా వోల్ 56 బంతుల్లో 1సిక్సర్, 17 ఫోర్లతో 99* పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్