క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ కాలేజీ ఈవెంట్‌లో హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అతడు కొంతసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అడిగారు. హిందీ గురించి అడగ్గా కొంతమంది నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. అప్పుడు దానిపై అశ్విన్ స్పందిస్తూ.. ‘‘ఇక్కడ మీకో విషయం చెప్పాలి. హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదు’’ అని అన్నాడు.