పుణెలోని ఓ వివాహ వేదిక మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఒకే కల్యాణ మండపంలో హిందూ, ముస్లిం పెళ్లి వేడుకలు జరిగాయి. పుణెలోని వాన్‌వరియే ప్రాంతంలో ఓ హిందూ జంట వివాహం జరుగుతుండగా భారీ వర్షం ఆటంకం కలిగించింది. దగ్గర్లోనే మరో ముస్లిం జంట వివాహ రిసెప్షన్ జరగడాన్ని గమనించిన హిందూ కుటుంబ సభ్యుల కొద్దిసేపు కల్యాణ మండపాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం కుటుంబం అవకాశం ఇవ్వడంతో హిందూ జంట పెళ్లి జరిగింది.