భారత సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II (ఐదు న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనాల పరీక్షల వరుస) అంటారు. భారతదేశాన్ని అణు దేశంగా ప్రకటించడమేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా సంతకం చేశారు.