నాని హీరోగా నటిస్తున్న ‘హిట్-3’ మూవీ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే 30 మిలియన్ల వ్యూస్ సాధించి టాప్ ట్రెండింగ్లో నిలిచింది. ఈ ట్రైలర్ పలు సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. శైలేశ్ కొలాను దర్శకత్వంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. కాగా, మే 1న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.