HYDలో హిట్ అండ్ రన్.. యువకుడు మృతి (వీడియో)

54చూసినవారు
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. మీర్‌పేట్‌ పీఎస్ పరిధిలోని మిథిలా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డు దాటుతున్న అనిల్ అనే యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. అనిల్ తలకు తీవ్ర గాయం కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. ప్రమాదంపై మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మూడు రోజులైనా పోలీసులు పట్టించుకోవడంలేదని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్