విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం(వీడియో)

57చూసినవారు
AP: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ ఉన్నత పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు హెడ్ మాస్టర్ సాష్టాంగ నమస్కారం చేసి, వారి ముందు గుంజీలు తీశారు. పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని, వారు చదువులో వెనుకబడుతున్నారని స్కూల్ HM రమణ తెలిపారు. 'మేము మిమ్మల్ని కొట్టలేము.. తిట్టలేము.. ఏమీ చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్