చైనాలో HMPV వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తి చెందుతున్నందున శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను తరచుగా కడగాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని పేర్కొంది.