తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ మరింత పెరిగింది. ఈ పథకం వల్ల చాలా మంది పురుషులకు సీట్లు దొరకడం లేదనే వాదన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేయి పెట్టి ఆపితే బస్సు ఆపడేమో అని.. బండరాయి చేతిలో పట్టుకుని డ్రైవర్‌కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలర్ట్ అయిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపాడు.