ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామారాజు పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. తాజాగా హాలీవుడ్ స్టార్ లుకాస్ బ్రావో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్ నటనను ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో తాను ఇటీవల రాజమౌళి 'RRR' సినిమా చూశా.. రామ్ చరణ్ అద్భుత నటుడు, యాక్షన్ సన్నివేశాల్లో చరణ్ గొప్పగా నటించాడని లుకాస్ బ్రావో చెప్పాడు.