ఆరేళ్ల కూమారుడితో కలిసి హోంగార్డు ఆత్మహత్య

51చూసినవారు
ఆరేళ్ల కూమారుడితో కలిసి హోంగార్డు ఆత్మహత్య
AP: ఆరేళ్ల కుమారుడితో కలిసి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో చోటు చేసుకుంది. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అట్టా ఝాన్సీ తన ఆరేళ్ల కుమారుడు దినేశ్ కార్తీక్‌తో కలిసి ఏలేరు కాలువలో దూకారు. భర్త అచ్యుతరావు వేధిస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఏలేరు కాలువలో మృతదేహాలు లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్