ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు దుర్మరణం

83చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు దుర్మరణం
తెలంగాణలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ హోంగార్డ్ మృత్యువాత పడ్డాడు. కొల్చారం మండలం కిష్టాపూర్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం ఇబ్రహీంబాద్ దుర్గా తండాకు చెందిన మెగావత్ శివరాం (44) మెదక్‌లోని భరోసా కేంద్రంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం తన ఇంటి నుంచి బైక్‌పై మెదక్ వెళ్తుండగా కిష్టాపూర్ శివారులో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్