సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువు సోకి కార్మికులు మృతి చెందితే సదరు ఇంటి యజమానులే బాధిత కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. చెన్నై మహానగర కార్పొరేషన్ కార్మికులతో ఓ వ్యక్తి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు సోకి ఓ కార్మికుడు మృతి చెందారు. ఈ కేసులో కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది.