సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. తన భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.