కాకినాడలో ఘోరం.. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడని చంపేశారు

273చూసినవారు
కాకినాడలో ఘోరం.. చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడని చంపేశారు
AP: తన చెల్లితో చనువుగా మాట్లాడుతున్నాడని ఓ యువకుడిని ఆ బాలిక సోదరుడు దారుణంగా చంపాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా బ్రహ్మానందపురంలో చోటు చేసుకుంది. తన చెల్లితో మాట్లాడుతున్నాడని పి.వేమవరం గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్ అదే గ్రామానికి చెందిన కిరణ్ కార్తిక్ (19)ను మందలించాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కృష్ణప్రసాద్, తన స్నేహితుడు వినోద్‌తో కలిసి కిరణ్ కార్తిక్‌ను చంపి పూడ్చిపెట్టాడు. 10 రోజుల తర్వాత నేరం అంగీకరించి పోలీసులకు లొంగిపోయారు.

సంబంధిత పోస్ట్