ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. నేపాల్‌లోని కురి గ్రామంలో ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం గుర్రం పక్కనే డ్యాన్స్ చేస్తుంటుంది. అయితే, గుర్రం అనుకోకుండా స్పందించి ఆ యువతిని రెండు కాళ్లతో తన్నేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ‘‘రీల్ క్వీన్స్‌ని చూసి పశువులు కూడా విసిగిపోతున్నాయ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.