దేశంలో శిశువుల అక్రమ రవాణా జరిగితే ఆస్పత్రి లైసెన్స్ రద్దుచేస్తామని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిన్నారుల అక్రమ రవాణా కేసుల పట్ల యూపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆస్పత్రిలోనైనా అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్సు రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. చిన్నారి అక్రమ రవాణా కేసులో నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం చేసింది.