సైన్యంలో పనిచేసే కుక్కలు అంత యాక్టివ్‌గా ఎలా దొంగల్ని పట్టుకుంటాయా అని అనుకుంటాం. అసలు వాటికి ఇచ్చే ట్రైనింగ్ ఏంటి అబ్బా అని ఆలోచిస్తాం. అందరీ ఆలోచనలకి చెక్ పెడుతూ కుక్కలకు తమ శిక్షణా విధానాలను చూపిస్తూ బీఎస్ఎఫ్ (BSF) ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో శత్రువుల జాడ పట్టడం, బాంబులు గుర్తించడం వంటి కీలక పనులపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.