క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకే అనర్హులని.. అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అందులో భాగంగా పై వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. ECIకి నోటీసులిచ్చి, విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.