హైదరాబాద్ నడిబొడ్డున కూర్చుని డిన్నర్ చేస్తే రహస్య భేటీ ఎలా అవుతుందని జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. 'మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైనే భేటీలో చర్చించాం. మా సమస్యలపై లిఖితపూర్వకంగా సీఎంకు రాసి ఇచ్చాను. లేకలేక మా MBNR జిల్లా నుంచి సీఎం అయ్యారు. సీఎం రేవంత్‌కు మేమే పిల్లర్ల లాంటి వాళ్ళం. జడ్చర్ల చుట్టుపక్కల భూదాన్ భూములన్ని కొట్టేశారు. మా దళితులు, ఎస్టీలు, ఎస్సీలకు న్యాయం జరిగే వరకు కొట్లాడతాను' అని వ్యాఖ్యానించారు.