ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో మౌని అమావాస్య వేళ భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. ఈ వీడియోలో ప్రజలు గుమిగూడి తోపులాట జరిగినప్పుడు ఎలా తమను తాము కాపాడుకోవాలో చూపించారు. ‘రద్దీ జనాల మధ్య బాక్సింగ్ పొజిషన్‌లో నిల్చుంటే మంచిదన్నారు. ఒకవేళ కిందపడిపోతే ముడుచుకుని పడుకోవాలి’ అని ఈ వీడియోలో తెలిపారు. CPR గురించి తెలుసుకోవడం అత్యవసరం.