విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత ఆడబోతున్న రంజీ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని వెల్లడించాడు. రంజీల్లో కోహ్లీ ఓవరాల్‌గా 23 మ్యాచ్‌లు ఆడి 1,547 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలున్నాయి. రంజీ ట్రోఫీలో కోహ్లీ నవంబర్ 2006లో అరంగేట్రం చేశాడు. చివరి మ్యాచ్ నవంబర్ 2012లో ఆడాడు.