AP: మాజీ సీఎం జగన్‌తో ఓ చిన్నారి తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే వంశీని కలవడానికి వచ్చిన జగన్‌ను కలవడానికి విజయవాడ జైలు వద్దకు చాలా మంది వచ్చారు. ఈ క్రమంలో ఓ చిన్నారి జగన్‌ను కలవాలని కన్నీటితో వేడుకుంది. చివరికి జగన్ చిన్నారిని అభిమానంతో ఎత్తుకున్నారు. అనంతరం ఆ బాలికతో సెల్ఫీ దిగారు. ఆ చిన్నారికి మాజీ సీఎంపై ఉన్న అభిమానాన్ని చూసి జనం ఫిదా అవుతున్నారు.