ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలంటే?

54చూసినవారు
ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలంటే?
సెప్టెంబర్ 7, శనివారం వినాయక చవితి పండుగ. ఈ రోజు ఇళ్లల్లో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తాం. అయితే మనం ఇంట్లో పూజ చేసే విగ్రహం ఈ విధంగా ఉండాలి.

1. గణేష్ విగ్రహానికి తొండం ఎడమ వైపునకు వంగి ఉండాలి. అలాంటి విగ్రహం శుభప్రదం
2. వినాయకుడు నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదు.
3. నలుపు లేదా చాలా ముదురు రంగు విగ్రహాన్ని తీసుకోకూడదు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి శుభప్రదమైన రంగులు మంచివి.
4. మట్టితో చేసిన దేవతా విగ్రహం ఉత్తమం. మట్టి పంచభూతాలలో ఒకటి.
5. గణేష్ విగ్రహం చేతిలో పాశం, లడ్డూ, అంకుశం ఉండాలి
6. మరో చేయి వరదముద్రలో ఉండాలి

సంబంధిత పోస్ట్