మామిడిలో పూత తొలిదశలో చీడల నివారణ ఎలా?

53చూసినవారు
మామిడిలో పూత తొలిదశలో చీడల నివారణ ఎలా?
మామిడి చెట్లలో జనవరిలో పూమొగ్గలు రావడం ప్రారంభమవుతాయి. ఈ దశలో మామిడిని తేనె మంచు పురుగు, మిడ్డి పురుగు, పేను&బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తాయి. ఈ చీడల నివారణకు చెట్లలో పూత ప్రారంభదశలో మొగ్గలుగా ఉన్నప్పుడే నివారణ చర్యలు చేపట్టాలి. ఇమిడాక్లోప్రిడ్ (లీటర్ నీటికి 0.5 మి.లీ.) లేదా బూప్రొపెజిన్ (లీటర్ నీటికి 2 మి.లీ.) మందులలో ఒకదానితో పాటు నీటిలో కరిగే గంధకం (సల్పెక్స్, లీటర్ నీటికి 3 గ్రా.) కలిపి స్ప్రే చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్