పంజాబ్‌లో భారీగా డ్రగ్స్, డబ్బు స్వాధీనం

74చూసినవారు
పంజాబ్‌లో భారీగా డ్రగ్స్, డబ్బు స్వాధీనం
పంజాబ్‌లోని గోయింద్వాల్ జైలులో ప్రస్తుతం ఖైదీగా ఉన్న స్మగ్లర్ అర్ష్‌దీప్ సింగ్ హవాలా ముఠాను పోలీసులు ఛేదించారు. అర్ష్‌దీప్ అనుచరులు ఆరుగురిని మంగళవారం అరెస్ట్ చేసి, వారి నుంచి 4.5 కిలోల హెరాయిన్, రూ.8.7 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును నిందితుడు పాక్‌కు తరలించాడని, జైలులో ఉపయోగించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్