యూపీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫరూఖాబాద్ జిల్లా అమృత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడేరా గ్రామంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా గుడిసెలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఐదు గుడిసెలు బూడిదయ్యాయి. ఈ క్రమంలో ఓ యువకుడు ఆ మంటల్లో కాలిపోవడంతో.. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.