నిత్యావసర ధరలు సామాన్య ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలో.. ఉల్లి రేట్లు భారీగా పెరిగి షాకిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వారం రోజుల క్రితం కేజీ రూ.50లోపు ఉన్న ధర ప్రస్తుతం రూ.70-80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఉల్లి రేట్లు పెరగడంతో ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.