భారీగా పెరిగిన కూరగాయల ధరలు

59చూసినవారు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు అమాంతం పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లు, మండీలలోనే కిలో రూ.80-90 ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.100 దాటేసింది. ఉల్లి ధర కూడా రూ.70-80కి చేరింది. కిలో బెండకాయలు రూ.70, దొండకాయలు రూ.60, క్యాప్సికం రూ.80, బీరకాయ రూ.70, బీన్స్ రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్