తయారీ-సేవల రంగాల్లో ఉద్యోగాల కల్పన తగ్గుతున్న నేపథ్యంలో, పర్యాటకం-ఆతిథ్య రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. కొవిడ్ పరిణామాలు ముగిశాక పర్యాటకం బాగా పెరగడం ఇందుకు నేపథ్యమని వివరించింది. పర్యాటక కేంద్రాల్లో మౌలిక వసతులు పెంచాలని, సేవల మెరుగుదలకు సంబంధిత నైపుణ్యాల్లో శిక్షణ కార్యక్రమాలు అవసరమని పేర్కొంది.