పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడడాన్ని మాత్రం నివారించలేకపోతున్నారు. నేడు హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముంబై, బెంగుళూరుకు, గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముతున్నట్లు నైజీరియన్లు వెల్లడించారు. వీరు 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌లో 30 మంది కస్టమర్‌లను ఇచ్చేందుకు తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు.