తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడైన వంశీధర్ రెడ్డి హల్‌చల్ చేశాడు. గురువారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఫొటోలు తీయించుకున్నాడు. ఏకంగా నలుగురు వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లతో ఫొటోషూట్ నిర్వహించాడు. ఇంత హడావుడి చేస్తున్నా విజిలెన్స్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.