భర్త అప్పులు చేసి ఇంటి నుంచి పారిపోగా భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన యూపీలోని బరౌలీలో వెలుగుచూసింది. పుష్పేంద్ర అనే అతను బరౌలీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అత్యాశకు పోయి అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టడంతో రూ.లక్షల్లో నష్టపోయాడు. దీంతో ఇంటి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా ఇంటికి రావాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.