మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్‌లో విషాదం జరిగింది. భార్యభర్తలు గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. పోలీసులు వివరాల ప్రకారం.. సంతోష్ (22), దీపిక(18)లు ప్రేమ వివాహం చేసుకుని అంబర్ పేటలో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇటీవల దీపిక బోడుప్పల్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. బుధవారం మరోసారి గొడవ జరగగా.. సంతోష్ బ్లేడ్‌తో దాడి చేసుకోగా.. దీపిక భయంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.