TG: భార్యను రోకలి బండతో భర్త కొట్టి చంపిన ఘటన సంగారెడ్డి (D) పటాన్ చెరు (M) పెద్ద కంజర్లలో ఇవాళ చోటు చేసుకుంది. ప్రమీల (26), రమేష్ భార్యాభర్తలు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో భార్య రమేష్‌కు దూరంగా ఉంటోంది. ఆగ్రహంతో భర్త ప్రమీలను రోకలి బండతో కొట్టి చంపాడు. అడ్డొచ్చిన అత్త కవితపై దాడి చేశాడు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. సీఐ వినాయక్ రెడ్డి కేసు నమోదు చేశారు.