AP: సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో ప్రియుడితో ఉన్న భార్యను ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ప్రియుడి చేయి సగం నరికాడు. అనంతరం అతడిని తీసుకెళ్లి పంట కాలువలో పడేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రియుడు ఏసు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఏసు చేయిని స్వాధీనం చేసుకున్నారు.