ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన 13 ఏళ్లకు భార్య ప్రేమ వ్యవహారం తెలియడంతో ఆమె భర్త షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సతాయ్ అనే వ్యక్తి 13 ఏళ్ల క్రితం సీమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కాగా వీరి వివాహానికి ముందు తన భార్య శివానంద్ అనే వ్యక్తిని ప్రేమించింది. వారి బంధం ఇప్పటికీ కొనసాగుతుండటంతో శివానంద్‌తో పెళ్లి జరిపించాడు.