భార్యతో గొడవపడి ఇంటికి నిప్పంటించిన భర్త (వీడియో)

84చూసినవారు
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బహోదర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్‌కు చెందిన రామ్ కుష్వాహా, తన భార్య రజనీ కుష్వాహాకు గత కొద్దీ రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మరొకసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు.. కోపోద్రిక్తుడైన భర్త ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి అంతా కాలిపోయింది. కానీ అతను బయట అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్