భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. శ్రావణ్ అనే వ్యక్తి తన భార్య పని చేస్తే ఓ వస్త్ర దుకాణంలో కస్టమర్ల ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వస్త్ర దుకాణం వద్ద భార్యతో గొడవపడి.. కోపంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మీద పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. కాగా పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.