కర్ణాటక తుమకూరు జిల్లాలోని అంతర్సనహళ్లిలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. భార్యాభర్తల మధ్య వివాదం హింసాత్మకంగా మారింది. భర్త తన భార్యను 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు. హత్యకు గురైన మహిళను గీత (30)గా పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో నిందితుడిని నవీన్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.