భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్ హైదరాబాద్ మారబోతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ కు భారీ డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. నగరంలో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారుల సమీక్షలో సీఎం ఆదేశించారు.