చైనా ప్లస్ వన్ వ్యూహంలో హైదరాబాద్‌ను ప్రపంచంలో ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు. 'వరదలు లేని నగరంగా, దేశంలోనే పర్యావరణ హితమైన హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టాం. అందులో భాగంగా 55km పొడవైన మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించాం. 360 కి.మీ పొడవు ఉండబోయే RRR వెంట రీజినల్ రింగ్ రైల్‌ను నిర్మించాలని ప్రధానమంత్రిని కోరాం' అని వ్యాపారవేత్తలకు వివరించారు.