ప్రమాదంలో హైదరాబాద్‌.. వాటర్ ట్యాంకర్లే దిక్కు!

84చూసినవారు
ప్రమాదంలో హైదరాబాద్‌.. వాటర్ ట్యాంకర్లే దిక్కు!
విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో జనవరి నుంచి మార్చి చివరకి భూగర్భ జలాలు 25 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు చేరాయి. మే చివరి నాటికి నీటి నిల్వలు మరింత ప్రమాదకర స్థాయికి పడిపోతాయని భూగర్భశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కూకట్‌పల్లి ఏరియాలో అత్యధికంగా 25.9 మీటర్ల లోతుకు చేరాయని చెప్తున్నారు. వాటర్ ట్యాంకర్లే దిక్కు అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్