T-Hubలో దాడి శివలీలకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

70చూసినవారు
T-Hubలో దాడి శివలీలకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
వనపర్తి జిల్లా రేవల్లి గ్రామానికి చెందిన దాడి శివలీల, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, అభిషేక్ బొడ్డు, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని దాడి శివలీలకు పట్టా అందజేశారు..దాడి శివలీల మాట్లాడుతూ,
"AI ద్వారా పాటలు రూపొందించడం, వీడియో ఎడిటింగ్ చేయడం, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి అని తెలుసుకున్నానన్నారు. ఎప్పుడైనా మనకు మనమే కాంపిటీషన్, వేరే వాళ్లు కాదు అని గ్రహించానన్నారు. సంపాదన కోసం మన మైండ్‌సెట్ మార్చుకోవాలన్నారు. అలాగే పీపుల్ రిలేషన్‌షిప్ అనేది చాలా కీలకమన్నారు. ఈ బూట్ క్యాంప్ ద్వారా నాకు తెలియని అనేక విషయాలు నేర్చుకున్నాను," అని తెలిపారు.

సంబంధిత పోస్ట్