కేంద్రమంత్రికి పితృ వియోగం
AP: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృ వియోగం కలిగింది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు(91) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యనారాయణరాజు తుదిశ్వాస విడిచారు. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి మరణంపై సంతాపం తెలుపుతున్నారు.