జలమండలి ఎస్టీపీల్లో పని చేసే కార్మికులకు అంబర్ పేట్ ఎస్టీపీ ప్రాంగణంలో శుక్రవారం ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీ రామానుజ సేవ ట్రస్ట్, జనహిత సేవ ట్రస్ట్ సంయుక్త అధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎండీ అశోక్ రెడ్డి, ఈడి మయాంక్ మిట్టల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ కార్మికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.