బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేశారో, 15 నెలల కాంగ్రెస్ పాలనలో మేము ఏం చేశామో నిరూపించడానికి చర్చకు సిద్ధమని బల్మూరి వెంకట్ అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. దీనికి ఒక్క రూపాయి ఖర్చు లేదు మరి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.